NTV Telugu Site icon

Geetha Arts: బెస్ట్ ‘డ్యాన్సర్’ అల్లు అర్జున్ కాదు హృతిక్ రోషన్..?

Bunny

Bunny

Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు అల్లు అర్జున్. ఆయన మూమెంట్స్ కు స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. గ్రేస్ ఫుల్ గా బన్నీ డ్యాన్స్ చేస్తుంటే.. అందరు అలా నోరెళ్ళ బెట్టి చూడాల్సిందే. ఇక ఈ విషయం పక్కనపెడితే.. ఈ మధ్య గీతా ఆర్ట్స్.. ఒక సెన్సేషనల్ టైటిల్ ను రిజిస్టర్ చేయించిందని టాక్. అదే డ్యాన్సర్. ఇక ఈ టైటిల్ వినగానే బన్నీ.. తన సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు అని పుకార్లు వచ్చేశాయి. టైటిల్ కు తగ్గట్టుగా బన్నీ బెస్ట్ డ్యాన్సర్ అని పేరు కూడా ఉంది. దీంతో ఈ సినిమా ఓకే అయ్యిందని టాక్ నడిచింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ఈ టైటిల్.. అల్లు అర్జున్ కోసం కాదంట. అయితే అది ఎవరి కోసం అంటే.. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కోసమని టాక్ నడుస్తోంది.

Sai Pallavi: పుష్ప 2 లో నేను.. చాలా హ్యాపీగా ఉంది

ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు. తెలుగులో హృతిక్ రోషన్ ఎంట్రీ ఇస్తున్నాడా..? నమ్మమంటారా..? అంటే నిజమే అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. ఇక ఈ సినిమాకు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడట. హృతిక్ డ్యాన్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. అతనికోసమే ఈ టైటిల్ ను ఏరికోరి అల్లు అరవింద్ రిజిస్టర్ చేయించాడట. ఇంకోపక్క ఈ పుకార్లలో ఏది నిజం కాదని చెప్పుకొస్తున్నారు. ఆ టైటిల్ ఒక తెలుగు హీరో కోసమే కానీ, అది ఎవరు అనేది తెలియదు అని అంటున్నారు. మరి ఈ పుకార్లకు గీతా ఆర్ట్స్ చెక్ పెడుతుందేమో చూడాలి.

Show comments