NTV Telugu Site icon

Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ

Rajinikanth On Politics

Rajinikanth On Politics

Gave Up On Politics On Doctor Advice Says Rajinikanth: తమిళనాడు ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఆ తర్వాత రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యల వల్లే తాను రాజకీయాల్లోకి రావడం లేదని అప్పట్లో స్పష్టతనిచ్చారు. అయితే.. ఆయన అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదని భావించారు. విమర్శకులు సైతం రజినీ నిర్ణయంపై అప్పట్లో ధ్వజమెత్తారు. సినిమాల్లో నటించడానికి ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడు.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తేడా కొట్టేసిందా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విమర్శలపై ఆరోజుల్లో రజినీ సమాధానం ఇవ్వలేదు. మౌనం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత.. తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల ప్రధాన కారణమేంటో వెల్లడించారు.

Margani Bharath Ram: అతడో అరిటాకు, సర్కస్‌లో బఫూన్.. ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు

శనివారం చెన్నైలోని సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్.. ఈ సందర్భంగానే తన రాజకీయ సన్యాసం గురించి వివరణ ఇచ్చారు. ‘‘గతంలో కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చినప్పుడు నేను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. అయితే.. ఆ చికిత్స నాకు సంతృప్తికరంగా అనిపించలేదు. అప్పుడే నేను డా. రవిచంద్రన్‌ని కలిశాను. అప్పటికే నా కిడ్నీ 60% పాడైనట్టు నిర్ధారణ అయ్యింది. ఆ డాక్టర్ కొన్ని సంవత్సరాల పాటు వైద్య నిర్వహణకు సాయం చేశాడు. మొదట్లో పరిస్థితులు బాగానే ఉండేవి కానీ, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. ఆ సమయంలో రవిచంద్రన్ నన్ను కిడ్నీ మార్పిడి కోసం అమెరికాలో ఉన్న రొచెస్టర్‌లోని మాయో క్లినిక్‌కు వెళ్లమని సూచించాడు. ఆయన సూచన మేరకు విదేశాలకు వెళ్లి, ట్రీట్మెంట్ తీసుకున్నాను’’ అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చారు.

Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

అయితే.. తాను రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయాన్ని డాక్టర్ రవిచంద్రన్ అంగీకరించలేదని రజినీకాంత్ తెలిపారు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంటే.. అప్పుడు మాస్క్ ధరించాలని, బహిరంగ ప్రచార సమయాల్లో 10 అడుగుల దూరం పాటించాలని డాక్టర్ తనకు చెప్పారన్నారు. ఈ రెండూ అసాధ్యమని తనకు తెలుసని, అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే.. ఈ విషయం ప్రజలకు ఎలా చెప్పాలో తెలియక భయపడ్డానని, అది తన ప్రతిష్టపై ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందానని రజినీ అన్నారు. ఆ సమయంలో డాక్టర్ తనకు ధైర్యం ఇవ్వడంతో, ఎలాంటి భయం లేకుండా రాజకీయాల్లోకి రానని ప్రకటించానని చెప్పారు. డాక్టర్ రవిచంద్రన్ సూచన మేరకే రాజకీయ సన్యాసం తీసుకున్నానని స్పష్టం చేశారు.