NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: శివాజి గుట్టురట్టు చేసిన గౌతమ్.. తేల్చుకుంటా అంటూ షాకింగ్ గా?

Shivaji Vs Gautam

Shivaji Vs Gautam

Gautham Slams Shivaji in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో సీజన్ లో కొత్త కంటెంట్‌ను చూపించడంతో పాటు టాస్కులను మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నారు. 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘హాల్ ఆఫ్ బాల్’ అనే టాస్క్ ఇచ్చిన క్రమంలో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులుల జట్టుగా చేసి రకరకాల టాస్కులను ఇచ్చారు. వీటిలో గౌతమ్ కెప్టెన్సీలోని వీర సింహాలు గెలవడంతో తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అర్హత వీర సింహాలు టీమ్ సభ్యులు అందుకున్నారు. వాళ్లకు బీన్ బ్యాగ్ టాస్క్ ఇచ్చి ఈ టాస్కులో వీర సింహాలు టీమ్ సభ్యులకు బదులుగా గర్జించే పులుల టీమ్ వారు ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకోసం ఆ టీమ్ సభ్యులను తమ బదులు ఆడేలా ఒప్పించాలని చెప్పగా ఆరుగురు కంటెస్టెంట్లు ఆడడం కుదరక ఒకరు తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అమర్‌దీప్, శివాజి, ప్రియాంక, భోలే షావలిలు కలిసి గౌతమ్‌ను తీసేయాలని అనుకుని అశ్వినికి చెప్పగా గౌతమ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Producer: మహిళా జర్నలిస్టుతో సినీ నిర్మాత అసభ్య ప్రవర్తన

కెప్టెన్సీ టాస్కు సమయంలో శివాజి రూల్స్ పాటించలేదని, తనను తప్పించాలని చూశాడని గౌతమ్ ఆరోపించి కెమెరా దగ్గరకు వచ్చి ‘బిగ్‌బాస్ నన్ను ఒకసారి కన్ఫెషన్ రూమ్‌కు పిలవండి, చాలా విషయాలు రాంగ్‌గా బయటికి వెళ్తున్నాయి -నేను వీటిని యాక్సెప్ట్ చేయలేనని, అదే జరిగితే నేను షో నుంచి బయటికి వెళ్లిపోవడానికి కూడా సిద్ధం అని చెప్పారు. ఆ తర్వాత గౌతమ్ ‘శివాజి అన్న గేమ్ మొదలయ్యే ముందు అందరినీ పిలిచి గౌతమ్ ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నారు అయితే అర్జున్, యావర్ కూడా కెప్టెన్ అయ్యారు కదా, అదే లాజిక్‌తో వెళ్లితే వాళ్లు కూడా గేమ్ ఆడొద్దు ఒక ఫిజికల్ గేమ్‌ను కూడా ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసి.. నీతి నిజాయితీ, ధర్మం అని నీతులు చెబుతుంటారు’ అంటూ ఆరోపణలు చేశాడు. ఆ తరువాత గౌతమ్ ‘శివాజి చాలా తప్పులు చేస్తున్నారు, మాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ ఆయన విన్ అవ్వొచ్చు.. కప్పు కొట్టొచ్చు.. ప్రైజ్ మనీ తీసుకోవచ్చు అది కాదు నాకు మేటర్ కాదు అట్లాంటిది ఏమైనా ఉంటే నన్ను పంపించేయండి, నేను నామినేషన్స్‌లో లేను నన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయండి. నాగ్ సార్‌ని కూడా ఇదే కొశ్చన్ వేస్తా. న్యాయం కావాలి’ అంటూ మాట్లాడడం హాట్ టాపిక్ అయింది.