Site icon NTV Telugu

Gargi: ఆ విషయంలో సాయి పల్లవి తొందరపడిందా..?

Gargi

Gargi

సాయి పల్లవి.. ఇటీవల విరాట పర్వం చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రముఖుల ప్రశంసలు అందుకొంటుంది. మొదటి నుంచి పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలకే సై అంటోన్న సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. గౌతమ్ రామచంద్ర దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడలో విడులవుతున్న ఈ సినిమాను తమిళ్ లో హీరో సూర్య, జ్యోతిక రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఆడపిల్లల చదువు కోసం పోరాడే యువతిగా సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించనుంది. ఇకపోతే అంతా బాగానే ఉన్నా సాయి పల్లవి సినిమా రిలీజ్ విషయంలో తొందరపడింది అంటున్నారు అభిమానులు.

అందుకు కారణం కూడా లేకపోలేదు. జూలై 14 న రామ్ పోతినేని ‘ది వారియర్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ్ డైరెక్టర్ లింగుసామి తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచొ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత జూలై 21న `కార్తికేయ 2` జూలై 22న `థ్యాంక్యూ` జూలై 28న `హిట్ 2` జూలై 29న `రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇన్ని స్టార్ హీరోల సినిమాల మధ్య హైప్ లేని గార్గి ఎలా నెట్టుకొస్తుంది అనేది అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక సినిమా హైప్ పెంచితే తప్ప ప్రేక్షకులు ఆసక్తి చూపించరు. మరి ఉన్న ఈ కొద్దిరోజుల్లో సాయి పల్లవి సినిమాపై ఎలాంటి హైప్ ను తీసుకొస్తుంది..? ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తుందా..? ఇన్ని సినిమాలను దాటుకొని హిట్ ను అందుకోనున్నదా..? అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version