Site icon NTV Telugu

Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’

Bhagavanth Kesari

Bhagavanth Kesari

అఖండ, వీరసింహారెడ్డితో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన భగవంత్ కేసరి ఫస్ట్ గ్లింప్స్ నందమూరి ఫ్యాన్స్‌ చేత విజిల్స్ వేయించింది. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఆగష్టు 31న లేదా సెప్టెంబర్ 1న భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశాడట.

అఖండ సినిమా నుంచి బాలయ్య అంటే చాలు.. థియేటర్లో పునకాలు తెప్పిస్తున్నాడు తమన్. ముఖ్యంగా బాలయ్యకు తమన్ ఇచ్చే బీజిఎం పీక్స్‌ అని చెప్పొచ్చు. అందుకే భగవంత్ కేసరి మ్యూజిక్ ఆల్బమ్ అండ్ బీజిఎం పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉండగా.. ఒకటి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్ అని తెలుస్తోంది. అతి త్వరలోనే భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానుందని అంటున్నారు. ఈ సాంగ్ వినాయకచవితి ఫెస్టివల్ కి, గణేషుణ్ని ఉద్దేశించి ఉంటుందట. టీజర్ లో ఈ సాంగ్ కి సంబంధించిన క్లిప్స్ కి కూడా చూపించారు. చాలా మంది డాన్సర్స్ మధ్యలో బాలయ్య డాన్స్ చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు అంటే ఫుల్ సాంగ్ చాలా గ్రాండ్ గా షూట్ చేసి ఉంటారు. మరి రాబోయే వినాయక చవితికి భగవంత్ కేసరి పాట రిపీట్ మోడ్ లో వినిపిస్తుందేమో చూడాలి.

Exit mobile version