Site icon NTV Telugu

Game On Trailer: అన్న హీరో తమ్ముడు డైరెక్టర్‌.. బ్లూ వేల్ ఛాలెంజ్ ను గుర్తు చేసున్న ‘గేమ్ ఆన్’ ట్రైలర్

game on trailer

game on trailer

Game On Trailer Released: గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ‘గేమ్ ఆన్‌’ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. . సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి నిర్మించారు. ఇక శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఓ గేమింగ్ కంపెనీలో పనిచేసే కుర్రాడికి ఓ రియల్ గేమ్ ఎదురైతే అతని లైఫ్ లో ఏం జరిగింది అనే కథాంశంతో గేమ్‌ ఆన్ తెరకెక్కబోతుంది. సినిమాలో ఫుల్ యాక్షన్, రొమాన్స్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలిసి పోతుంది.

Salaar 2: సలార్ 2లో అయ్యగారు.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య

ఇక ఈ గేమ్‌ ఆన్ సినిమా ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌ కానుంది. ఈ సినిమా హీరో, దర్శకుడు ఇద్దరూ సొంత అన్నదమ్ములు కాగా నిర్మాత హీరోకి స్నేహితుడు కావడం విశేషం. 2016లో ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన బ్లూ వేల్ గేమ్ ఛాలెంజ్ ను పోలినట్టు ఉన్న గేమ్ ఆడదానికి హీరో సిద్ధం కావడాన్ని ట్రైలర్ లో చూపించారు. ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి విశేషాలు అన్నీ ట్రైలర్ లో చూపించారు. అన్నట్టు హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా వేరే లెవల్లో ఉంది. చూడబోతే కంటెంట్ ఉన్న సినిమాలనే కనిపిస్తోంది. అయితే ఫిబ్రవరి 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ పోటీలో నిలబడి థియేటర్లను తెచ్చుకుని కంటెంట్ జనానికి రీచ్ అయితే ఇక సినిమాను ఆపడం ఎవరి తరం కాదు.

Exit mobile version