Game on Movie Pre Release Event: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన గేమ్ ఆన్ లో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించారు. దయానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేసిన మాసివ్ ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యి. రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం బిగ్ టిక్కెట్ ను సైతం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా చూశా, మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా ఎక్కడా అనిపించలేదు, ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారు.
Tea Side Effects: టీ ఎక్కువగా తాగితే వృద్ధాప్యం వచ్చేస్తుంది..
హీరో గీతానంద్ పర్ఫామెన్స్ కూడా బాగా చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. శివ బాలాజీ మాట్లాడుతూ..”నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ నాన్న కుమార్. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు, ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్స్ తో సహా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక కూడా ఒక స్టోరీ ఉందన్న ఆయన గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీతా ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉందన్నారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
