NTV Telugu Site icon

Ram Charan: కూతురు పుట్టాక మొట్టమొదటి సారిగా షూట్ మొదలుపెట్టనున్న రామ్ చరణ్.. ఎప్పటి నుంచంటే?

Ram Charan

Ram Charan

Game Changer next schedule commences from July 11th: ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ అని గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ఆచార్య అనే సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి కావడంతో ఆ డిజాస్టర్ మరక రామ్ చరణ్ కి అంటలేదు. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అయితే దాదాపు మూడు నెలల్లో నుంచి జరగడం లేదు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా కమలహాసన్తో షూట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్ సినిమా పట్టుకోవచ్చని ఆయన భావించినట్లు ప్రచారం జరిగింది.

Double Ismart: రామ్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న పూరీ

అందుకు తగినట్లుగానే ఇండియన్ 2 షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసినట్లు చెప్పాలి. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక 12 పాపకు జన్మనివ్వడంతో రామ్ చరణ్ బ్రేక్ తీసుకున్నారు. నిజానికి చరణ్ పాప జన్మించడానికి నెలల ముందు నుంచే బ్రేక్ తీసుకుని పూర్తి సమయం ఉపాసనకే కేటాయించారు. ఇక ఎట్టకేలకు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. జూలై 11వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఒక హై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని, దీని కోసం హైదరాబాద్లో ఒక స్పెషల్ సెట్ కూడా నిర్మించారని తెలుస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ,యోగి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Show comments