Site icon NTV Telugu

Game Changer : దర్శకుడు శంకర్ పై అసంతృప్తి గా వున్న రాంచరణ్ ఫ్యాన్స్..

Whatsapp Image 2023 09 04 At 11.53.16 Am

Whatsapp Image 2023 09 04 At 11.53.16 Am

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ అదిరిపోయే విజువల్స్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా పై కాస్త గందరగోళం లో ఉన్నారు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం లో వస్తున్న రాంచరణ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుందని ఆశ పడ్డ రామ్ చరణ్‌ అభిమానులకు ఈ మధ్య నిరాశే ఎదురవుతుంది.. రామ్ చరణ్‌ గతం లో వరుసగా సక్సెస్ లను దక్కించుకున్నాడు. భారీ వసూళ్లు దక్కించుకున్న ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత చరణ్‌ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల మూవీ అంటూ ఎంతో నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ . కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల విషయం లో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు.

మొదట గేమ్ ఛేంజర్ సినిమా 2023 సంక్రాంతికి వస్తుంది అని అన్నారు.ఆ తర్వాత నుండి వరుస వాయిదాలు వేస్తూ వచ్చారు.. ఇప్పుడు 2024 సమ్మర్‌ లో కూడా విడుదల అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.. ఇప్పటి వరకు అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఎంత వరకు వచ్చింది అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వక పోవడంతో దర్శకుడు శంకర్‌ పై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో గేమ్‌ ఛేంజర్ సినిమా గురించి పదే పదే వార్తలు వస్తున్నా కూడా సినిమా విడుదల విషయం లో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో అయినా ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో బుచ్చిబాబు దర్శకత్వం లో కూడా రామ్ చరణ్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. కనుక రామ్ చరణ్ ఫ్యాన్స్‌ ఈ రెండు సినిమా ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version