NTV Telugu Site icon

Gadar 2: ప్రమాదంలో పఠాన్ రికార్డ్స్… హిందుస్థాన్ జిందాబాద్ నినాదం నార్త్ ని కమ్మేసింది

Gadar 2

Gadar 2

కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యాష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో పఠాన్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాములుగా లేదు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ సినిమాతో ఊపిరిపోసిన షారుఖ్ ఖాన్, సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తాడు అనుకుంటే పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 11న గదర్ 2 సినిమా థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యింది.

మొదటి రోజే 40 కోట్ల ఓపెనింగ్ రాబట్టి షారుఖ్-సల్మాన్ లాంటి స్టార్ హీరోల రికార్డులని కూడా బ్రేక్ చేసింది గదర్ 2. ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సమయానికి గదర్ 2 సినిమా 229 కోట్లని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇస్తోంది. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదంతో నార్త్ రాష్ట్రాలని పూర్తిగా కమ్మేసింది. ఇండిపెండెన్స్ డే ఒక్క రోజునే గదర్ 2 సినిమా 56 కోట్లని (మొదటి రోజు కన్నా 16 కోట్లు ఎక్కువ) రాబట్టింది అంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఏ రేంజులో వెళ్తున్నారో ఊహించొచ్చు. గదర్ 2 రిలీజ్ రోజునే అక్షయ్ కుమార్ నటించిన OMG 2 కూడా విడుదలయ్యింది. ఈ పోటీ లేకుండా గదర్ 2కి సోలో రిలీజ్ దొరికి ఉంటే ఈ పాటికి బాలీవుడ్ ర్యాంపేజ్ కలెక్షన్స్ ని చూసేది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ అండ్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే… సినిమాకి ఉన్న డిమాండ్ కన్నా థియేటర్స్ తక్కువగా ఉన్నాయి. సో గదర్ 2కి లాంగ్ రన్ దొరకడం అనేది గ్యారెంటీ. ఇదే రేంజులో బుకింగ్స్ ని మైంటైన్ చేస్తే చాలు సెకండ్ వీక్ ఎండ్ అయ్యే టైం కి గదర్ 2 పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం గ్యారెంటీ.

Show comments