Site icon NTV Telugu

Gadar 2: దంగల్, KGF 2 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి కానీ బాహుబలి 2 ఇంపాజిబుల్

Gadar 2

Gadar 2

వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 11న గదర్ 2 సినిమా థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి రోజే 40 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన గదర్ 2, ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సమయానికి 229 కోట్లని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదంతో నార్త్ రాష్ట్రాలని పూర్తిగా కమ్మేసింది గదర్ 2 మేనియా. ఎక్స్టెండెడ్ వీకెండ్ దొరకడంతో గదర్ 2 సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడం లేదు. రోజు రోజుకీ బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ గదర్ 2 మాత్రం స్లో అవ్వట్లేదు. ఇప్పటివరకూ కేవలం హిందీలోనే 440 కోట్లు రాబట్టి గదర్ 2 సినిమా ఆమిర్ ఖాన్ నటించిన దంగల్, KGF 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది.

నాలుగు కోట్ల మార్జిన్ తో KGF 2 కలెక్షన్స్ ని గదర్ 2 ని క్రాస్ చేసింది. మూడో వారం కూడా గదర్ 2 కలెక్షన్స్ లో జోష్ చూపిస్తూనే ఉంది. టాప్ 3 హిందీ సినిమాల లిస్టులోకి ఎంటర్ అయిన ఈ మూవీ నార్త్ బెల్ట్ లో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూనే ఉంది. సెప్టె,బార్ 7న జవాన్ సినిమా రిలీజ్ అయ్యే వరకూ గద్దర్ 2 స్లో అయ్యే అవకాశమే కనిపించట్లేదు. థర్డ్ వీక్ ఎండ్ వరకూ గద్దర్ 2 ఇదే రేంజ్ బుకింగ్స్ ని రాబడితే హిందీ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయే రేంజ్ కలెక్షన్స్ ని గద్దర్ 2 రాబట్టగలదు. ఇదిలా ఉంటే గద్దర్ 2 లాంగ్ రన్ లో నెక్స్ట్ టార్గెట్ అయిన బహుబలి 2ని బీట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ డబుల్ అయినా కూడా గద్దర్ 2, బాహుబలి 2ని బీట్ చేయడం కష్టం. రెండు సినిమాల మధ్య దాదాపు 80 కోట్ల మేర గ్యాప్ ఉంది కాబట్టి గదర్ 2 బాహుబలి 2ని రీచ్ అవ్వడం కష్టమే.

Exit mobile version