From the team of the Blockbuster web series #90s New Project announcement: ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయిన హ్యాష్ టాగ్ 90 అనే వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిత్య హాసన్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో నవీన్ మేడారం అనే దర్శకుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ యాప్ కి సబ్స్క్రైబర్లు పెరిగారు అంటే ఎంతలా ఈ వెబ్ సిరీస్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ వెబ్ సిరీస్ కి సెకండ్ సీజన్ ఉంటుందని అప్పట్లోనే యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సెకండ్ సీజన్ కాదు కానీ ఇదే కాంబినేషన్లో ప్రొడక్షన్ నెంబర్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం
ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నవీన్ మేడారం నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ టీం నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2 రాబోతుందని అయితే మోడరన్ వరల్డ్ లో ఒక ట్విస్ట్ ఉంటుందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఒక అమ్మాయి అబ్బాయి సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళుతున్నట్లుగా చూపించారు. బ్యాక్ డ్రాప్ చూస్తున్నట్లయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తోంది. ఒకపక్క నది మరొక పక్క కాలు అలాంటి ప్రాంతంలో ఈ సబ్జెక్ట్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. అయితే ఇది వెబ్ సిరీసా, లేక సినిమానా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రేపు అధికారికంగా ప్రకటించే సమయంలో ఈ విషయం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
