Ravali : ఒకప్పుడు ఆ బ్యూటీ తెలుగులో వరుస సినిమాల్లో మెరిసింది. 90స్ కిడ్స్ కు ఆమె బాగా తెలుసు. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెలోడీ సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమెను చూస్తే అసలు ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ భామ.. ఇప్పుడు ఇలా ఎందుకు మారిందో అర్థం కావట్లేదని ఆమె ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ రవళి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే.
Read Also : Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?
ఆ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆమె చేసిన దాంట్లో ఒరేయ్ రిక్షా, శుభాకాంక్షలు, జయభేరి లాంటి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. 18 ఏళ్లకే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి పెళ్లి సందడి మూవీతో బాగా పాపులర్ అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీని వదిలేసింది. యాక్టింగ్ పక్కన పెట్టి ఫ్యామిలీ, పిల్లలతో గడుపుతోంది. చాలా కాలం తర్వాత నేడు తిరుమల దర్శనానికి వచ్చింది. అక్కడ ఆమెను చూసిన వారంతా ఫొటోలు తీయగా వైరల్ అవుతున్నాయి.
Read Also : Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
