NTV Telugu Site icon

Samantha: మొదటి సారిగా నాగచైతన్య రెండో పెళ్లి గురించి స్పందించిన సమంత ..!

Sam

Sam

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది.అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ఒక స్టార్ బేస్ నిర్మించుకుంది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆమె సౌత్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సామ్ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఈ బ్యూటీ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడిప్పుడే తన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ మళ్లీ సినిమాలపై ఫొకస్ చేసింది.ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా సమంత చై రెండో పెళ్లి పై స్పందించింది..

సమంతో విడాకులు తర్వాత నాగ చైతన్య ,శోభితని రీసెంట్‌గా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు.అయితే వీరి పెళ్లిపై ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయింది..మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా? అంటూ యాంకర్ సమంతను ప్రశ్నించగా..

సమంత మాట్లాడుతూ ‘నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావాలని కూడా అంగీకరించను. అసూయ అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను కూడా’ అంటూ సమాధానం ఇచ్చింది సమంత. అంతే కాకుండా ‘ ఒక బంధం నుంచి బయట పడటం చాలా కష్టం’ అని కూడా తెలిపింది. ప్రజంట్ సమంత మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.