యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వాసువ సుహాస’ అంటూ సాగిన ఈ మొదటి పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా సింగర్ కారుణ్య పాడాడు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా మార్చాడు. సాంగ్ స్టార్టింగ్ లో వచ్చిన ‘శుభలేఖ సుధాకర్’ డైలాగ్స్ సినిమా కథని తెలిపేలా ఉన్నాయి. ‘కనిపించే ప్రతోడు మన నైబర్’ అని శుభలేక సుధాకర్ చెప్పిన డైలాగ్ కనెక్ట్ అవ్వడంతో, సాంగ్ వినే వాళ్లకి వెంటనే రీచ్ అవుతుంది. మొత్తానికి ‘వాసువ సుహాస’ సాంగ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా ప్రమోషన్స్ కి మంచి స్టార్ట్ ఇచ్చింది.
Read Also: Kiran Abbavaram: 2023లో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు
హీరో కిరణ్ అబ్బవరంకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లాస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ కాపాడుకోవాలి అంటే ‘వినరో భాగ్యమి విష్ణు కథ’ సినిమాతో పక్కా హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు కిరణ్ అబ్బవరాన్ని ఆడియన్స్ మరిచిపోయే ప్రమాదం ఉంది.
#VinaroBhagyamuVishnuKatha ~ 1st single #VaasavaSuhaasa ✨ Out now!
▶️ https://t.co/EoTWwKVvsn#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @nckarunya #KalyanChakravarthy @daniel_viswas @adityamusic #VBVK #VBVKOnFeb17th pic.twitter.com/2ZUt5jqI0N
— GA2 Pictures (@GA2Official) December 24, 2022
Read Also: Kiran Abbavaram: శివరాత్రికి విష్ణుకథ వినిపించనున్న అల్లు అరవింద్!
