Site icon NTV Telugu

Kushi: ‘ఆరా బేగమ్’పై మనసు పారేసుకున్న ‘ది’ దేవరకొండ…

Kushi

Kushi

రౌడీ హీరో ‘ది’ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్, “నా రోజా నువ్వే” లిరికల్ వీడియో బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ బర్త్ గిఫ్ట్ గా బయటకి వచ్చిన ఈ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. ఒక మెలోడీ సాంగ్ ని శివ నిర్వాణ స్వయంగా రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ పాడడం విశేషం. సాంగ్ కి అవసరమైన లిరిక్స్ ని, అందరికీ అర్ధం అయ్యే భాషలో శివ నిర్వాణ చాలా బాగా రాసాడు. సాంగ్ లో మణిరత్నం సినిమా టైటిల్స్ ఎక్కువగా వినిపిస్తాయి, దీని కారణంగా సాంగ్ వినగానే క్యాచీగా అనిపిస్తోంది. లిరికల్ సాంగ్ లో చూపించిన విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి, కాశ్మీర్ అందాలని బాగా క్యాప్చర్ చేసినట్లు ఉన్నారు.

Read Also: The Kerala Story: సినిమా బాన్… ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఊహించని స్టేట్మెంట్

“నా రోజా నువ్వే” సాంగ్ ని విజువల్స్ మరింత ఎలివేట్ చేశాయి. ఇక సామ్ ఖుషి మూవీలో ‘ఆరా బేగం’ పాత్రలో నటిస్తున్నట్లు ఈ సాంగ్ తో క్లియర్ గా చెప్పేశారు. కాశ్మీర్ అమ్మాయిగా సాంగ్ లో సామ్, నమాజ్ కూడా చేస్తూ కనిపించింది. విజయ్ దేవరకొండ చాలా కూల్ గా కనిపించాడు. విజయ్, సామ్ పెయిర్ చూడడానికి చాలా బాగున్నారు. ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఖుషి సినిమాకి యాడెడ్ అస్సేట్ అవ్వనుంది. తెలుగులో టాప్ ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు. మరి ఈ మూవీతో సామ్, విజయ్, శివ నిర్వాణ సాలిడ్ కంబ్యాక్స్ ఇస్తారో లేదో చూడాలి.

Exit mobile version