NTV Telugu Site icon

Nupur Sanon: ‘టైగర్ నాగేశ్వరరావు’ లవ్స్ ‘సారా’ నుపూర్ సనన్

Nupoor Sanon Tiger Nageswar Rao

Nupoor Sanon Tiger Nageswar Rao

First Look Of Nupur Sanon As Sara From Tiger Nageswara Rao Unveiled: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సారా పాత్రలో నుపూర్ సనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇటీవల గ్లింప్స్ విడుదలైన తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకి ఇప్పటి వరకు ఉన్న బజ్ మరింత పెరిగింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి ‘టైగర్ దండయాత్ర’ అనే టీజర్ విడుదలై వైరల్‌గా మారి అంచనాలని పెంచింది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఈ సినిమా మీద జనాల్లో కూడా క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Allu Arjun: నేషనల్ క్రష్ హర్టవ్వుద్దని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చేశారా?

ఇక తాజాగా ఈ రోజు, మేకర్స్ టైగర్ లవ్ సారా అని అంటూ నుపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రైలు విండో సీట్లో కూర్చున్న నుపూర్ తన లవర్ ని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. ఎత్నిక్ వేర్‌లో ఉన్న పోస్టర్‌లో నుపూర్ చాలా బ్యుటీఫుల్ గా కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన టైగర్ నాగేశ్వరరావు కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేయనుండగా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.