Indrani Trailer Looks Intresting: యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇంద్రాణి. అత్యాదునిక సాంకేతక ప్రమాణాలతో, వినూత్నభరితమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో స్టీఫెన్ పల్లం దర్శకుడిగా పరిచయ మవుతుండగా వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు, సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజయ్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ, ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Gaanja Shankar: టైటిల్ ఇలానా పెట్టేది.. సాయిధరమ్ తేజ్ సినిమాపై నార్కొటిక్ బ్యూరో ఘాటు వ్యాఖ్యలు
ఇక ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ `అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ మూవీ నిర్మించిన కేకే రెడ్డికి వారి మిత్రులకి ఆల్ ది బెస్ట్, అక్కడ ఉండి సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ప్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదన్నారు. వారు నా మిత్రులు అని చెప్పుకోవడానికి నేనే గర్వపడుతున్నా, ఇంద్రాణి పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్టర్ చూడగానే డైరెక్టర్ విజన్ అర్ధమైంది, ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఉంది. వారి కష్టం, ఖర్చు రెండు కనిపిస్తున్నాయి, ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. వారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నానన్నారు. డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ – ఈ కథ అనుకున్నప్పుడే పెద్దగా చేద్దాం అనుకున్నా, ట్రైలర్ చూస్తే ఇదే అత్యంత ఎక్కువ నిడివిగల ట్రైలర్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా రెండుగంటల నలబై నిమిషాల పాటు ఒక విజువల్ వండర్‌గా ఉంటుంది. టైమ్ మెషిన్, రోబో ఇలా ప్రతీది సినిమాలో కీలకంగా ఉంటుంది, ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తుంది. రాబోయో 50 సంవత్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది అనేది ఈ సినిమాలో చూపించాం. ఈ మూవీ యువతరానికి చాలా స్పూర్తి దాయకంగా ఉంటుందన్నారు.
