పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. దుండిగల్ సమీపంలోని బోరంపేట్‌లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన భారీ సెట్ లో హరిహర వీరమల్లు సినిమా చాలా భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. తాజాగా ఈ సెట్స్ లోనే అగ్నిప్రమాదం జరిగింది అనే వార్త వినిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కానీ నష్టం మాత్రం భారీగానే ఉందంటున్నారు. పైగా ఇదే సెట్ గతంలో వరదలకు కొట్టుకుపోయే పరిస్థితి వస్తే, అప్పుడు కూడా చాలా ఖర్చు పెట్టి మళ్లీ సెట్ ని రెడీ చేసారు.
ఈసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో, అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనే డిస్కషన్ మొదలయ్యింది. OG, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో సినిమాలకి డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… లేటెస్ట్ గా జూన్ మొదటి వారం నుంచి ‘హరిహర వీరమల్లు’ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి క్రిష్ రెడీ అవుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. దాదాపు పది రోజుల పాటు జరగాల్సిన ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లని షూట్ చెయ్యాల్సి ఉంది. మరి ఈ అగ్నిప్రమాదం కారణంగా షూటింగ్ వాయిదా పడుతుందేమో చూడాలి. ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడిన ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఎంతవరకు షూటింగ్ జరుపుకుందనే విషయం క్రిష్ కి మాత్రమే తెలియాలి.
