కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కొత్త మూవీ ‘FIR’ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని చోట్ల ‘FIR’ సినిమాపై నిషేధం విధించారు. సినిమాలోని ప్రధాన కంటెంట్, ఇతివృత్తం కారణంగా మలేషియా, కువైట్, ఖతార్‌లలో ‘FIR’ను బ్యాన్ చేసినట్టు సమాచారం. విష్ణు విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు మలేషియా, కువైట్, ఖతార్ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఆయా దేశాల్లోని స్థానిక సెన్సార్‌లను క్లియర్ చేయడంలో సినిమా విఫలమైనట్లు కనిపిస్తోంది.
Read Also : Unstoppable : బాలయ్య నెవెర్ ఎవర్ ఐ హావ్ ఫీట్… వాలైంటైన్స్ డే స్పెషల్
ఈ సినిమాలో మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు అబూ బక్కర్ అబ్దుల్లాగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయ్యే ముస్లిం యువకుడిగా నటించాడు. గౌతమ్ మీనన్ అతని వేటలో ఉన్న పోలీసుగా నటించాడు. ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం సమకూరుస్తుండగా, కిరుమి ఫేమ్ అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రసన్న జికె అందించారు.
