NTV Telugu Site icon

Twinkle Khanna: దావూద్ పార్టీలో హీరోయిన్ డాన్స్.. షాకింగ్ కామెంట్స్

Twinkle Khanna Danced In Dawood Ibrahim Party

Twinkle Khanna Danced In Dawood Ibrahim Party

Truth Behind Twinkle Khanna Danced In Dawood Ibrahim Party: ఒకప్పటి స్టార్ హీరోయిన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా నటనా ప్రపంచం నుండి విరామం తీసుకుని రచయిత్రిగా మారిందన్న సంగతి తెలిసిందే. ఆమె ‘మిసెస్ ఫన్నీబోన్స్’, ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’, ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ మరియు ‘వెల్ కమ్ టు ప్యారడైజ్’ పుస్తకాలను రచించారు. దీనితో పాటు, ఆమె తన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. అయితే ట్వింకిల్ ఖన్నా తన మీద ట్రోల్స్‌ వస్తే వాటికి సమాధానం ఇస్తూ పుకార్లకు శాశ్వతంగా ముగింపు పలికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే, వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం తాను పనిచేశానని దాదాపు దశాబ్దంన్నర క్రితం తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల మీద ఆమె స్పందించలేదు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత, ట్వింకిల్ ఈ రూమర్‌పై తన మౌనాన్ని వీడి తన స్టాండ్‌ను స్పష్టం చేసింది. 2010లో ట్వింకిల్ ఖన్నా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం పార్టీలలో ప్రదర్శన ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.

Kajal: అసలే సమ్మర్.. ఈ హాటు ట్రీట్ తట్టుకోవడం ఎలా కాజల్?

ఈ ఆరోపణలపై సర్వత్రా జోరుగా చర్చ జరగడంతో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి నుంచి ఈ విషయం మీద మౌనం పాటించిన ట్వింకిల్ తన కొత్త కాలమ్‌లో మీడియా ధోరణి గురించి రాసింది. “మల్లయోధుల నిరసన సమయంలో ఫోగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోల నుండి, కరోనావైరస్ యొక్క మూలాల గురించి లెక్కలేనన్ని కథనాల వరకు మేము ఇప్పటికే అనేక తారుమారు చేసిన వార్తా కథనాలను చూశాము” అని ఆమె రాసుకొచ్చింది. ‘నేను దావూద్ కోసం ఒక మెడ్లీ పాటకి డాన్స్ చేశా అని తెలిపే ఒక ప్రధాన స్రవంతి టెలివిజన్ ఛానెల్ టిక్కర్‌లో నా పేరును కూడా చూశాను. నా డ్యాన్స్ స్కిల్స్ WWF మ్యాచ్ చూడడానికి సమానమని నా పిల్లలకు కూడా తెలుసు, దావూద్ నాకంటే మంచి డ్యాన్సర్‌లను ఎంచుకుంటాడని న్యూస్ ఛానెళ్లకు తెలియాలి అంటూ ఆమె రాసుకొచ్చింది. అక్షయ్ కుమార్ ను 2010లో ప్రెస్ మీట్‌లో ఈ ఆరోపణల గురించి అడిగినప్పుడు, ‘ఈ కథలన్నీ ఎక్కడ నుండి వచ్చాయో నాకు తెలియదు. ఈ కథనాలు నిజమైతే నా ఇంటిపై దాడులు జరిగేవి కానీ ఒక్క కానిస్టేబుల్ కూడా రాలేదు, ఈ వార్తలు నన్ను కలచివేశాయి అని పేర్కొన్నారు.

Show comments