NTV Telugu Site icon

Akshay Kumar: సెంచరీ కొట్టిన ఖిలాడీ… ఇక ట్రాక్ ఎక్కినట్లేనా?

Akshay Kumar

Akshay Kumar

బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కి 2021లో వచ్చిన సూర్యవంషీ తర్వాత హిట్ అనే మాటే లేదు. 2022లో అక్షయ్ ఆరు సినిమాలు చేసాడు. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, కట్ పుట్లి, రామ్ సేతు, యాన్ యాక్షన్ హీరో సినిమాలతో అక్షయ్ కుమార్ ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ ఒక్క మూవీ కూడా అక్షయ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్ కుమార్ ఒక సీజన్ ని కంప్లీట్ చెయ్యడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. లో ఫేజ్ లో, ఫ్లాప్ స్ట్రీక్ తో 2023ని స్టార్ట్ చేసిన అక్షయ్ కుమార్ కి ‘సెల్ఫీ’ సినిమా మరింత షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది.

అక్షయ్ కుమార్ గ్యాప్ తీసుకుంటే బాగుండు అనే కామెంట్స్ వినిపించడం మొదలయ్యింది. హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా ఎగ్జైట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అక్షయ్ కుమార్, ఎప్పటిలాగే ఈసారి కూడా OMG 2 సినిమాతో ఆరు నెలలు తిరగకుండానే ఆడియన్స్ ముందుకి వచ్చాడు. గదర్ 2 సినిమా దెబ్బకి అక్షయ్ కుమార్ సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఉండవు అనుకున్నారు కానీ OMG 2 సినిమా స్లో అండ్ స్టడీ మోడ్ లో రోజురోజుకీ మంచి కలెక్షన్స్ ని రాబడుతూనే ఉంది. వీకెండ్స్, వీక్ డేస్ అనే తేడా లేకుండా OMG 2 సినిమా ఆడియన్స్ కి థియేటర్స్ కి రప్పిస్తుంది. పది రోజుల్లో వంద కోట్ల మార్క్ కి చేరుకున్న OMG 2 అక్షయ్ కుమార్ కి అవసరమైన హిట్ ని ఇచ్చింది. ఈ ఖిలాడీ లైనప్ లో బడే మియా చోటే మియా, ఆకాశం నీ హద్దురా రీమేక్ సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ తో కూడా హిట్ కొడితే అక్షయ్ కుమార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లే.

 

Show comments