డెత్ ఇంత భయంకరంగా ఉంటుందా. వామ్మో మరణాలు ఇలా కూడా సంభవిస్తాయా అని చెమటలు పట్టించడంతో పాటు సీట్స్ ఎడ్జెస్‌పై కూర్చొబెట్టిన హాలీవుడ్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి ఫైవ్ ఇన్ స్టాల్ మెంట్స్ వచ్చాయి. 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5తో ఈ భీతిగొల్పే డెత్ సీజన్లకు ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే ఇప్పుడు సిక్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్‌ను దింపుతోంది.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొన్నేళ్ల క్రితం దారుణమైన మరణాలను ముందే ఊహించి.. ఆపేసిన ఓ మహిళ ఫ్యామిలీని మళ్లీ ఇప్పుడు డెత్ నీడలా ఎలా వెంటాడుతుందో సీజన్ సిక్త్‌లో చూపించబోతున్నారు. ఫైనల్ డెస్టినేషన్ 5 పూర్తైన 14 ఏళ్లకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ ఇంటెన్సిటీ అండ్ క్యూరియాసిటిని కలిగిస్తోంది. ఇప్పుడు మరింత వయెలెంట్ డెత్స్ చూపించబోతున్నాడు డైరెక్టర్స్. డెస్టినీ, అన్‌ఎక్స్ పెక్టేడ్ డెత్స్ కుటుంబాన్ని ఎలా వెంటాడుతున్నాయో బామ్మ నుండి తెలుసుకున్న ఓ మనవరాలు.. తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటుందో అన్నదే మిగిలిన స్టోరీ. మే 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. గత ఏడాది మరణించిన టోనీ టాడ్ చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి. భారత్‌లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.