Site icon NTV Telugu

Tollywood : కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ఓకే.. ఫెడరేషన్ ప్రెసిడెంట్

Tollywood

Tollywood

Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ప్రతినిధులు ఓకే అన్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా 9 టు 9 కాల్షీట్లపైనే చర్చ జరిగింది. ఈ విషయంల పట్టువిడుపు ఉండాలని ఫెడరేషన్ ను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. ఈ మీటింగ్ అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ సమావేశం నిర్వహిస్తామన్నారు.

Read Also : Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ

ఆ మీటింగ్ తర్వాత సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు. మిగిలిన మూడు యూనియన్లకు కూడా వేతనాలు పెంచేందుకు ఛాంబర్ ప్రతినిధులు అంగీకరించినట్టు తెలిపారు అనిల్. తమ కండీషన్ల గురించి నిర్మాతలు పూర్తి స్థాయిలో అంగీకరించట్లేదన్నారు. రేపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు అనిల్. ఈ విషయాలను ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఫోన్ లో మాట్లాడుతున్నామన్నారు. చూస్తుంటే రేపు సమస్యకు స్వస్తిపలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?

Exit mobile version