Film Nagar Cultural Center Elections Held On Tommorrow: 2022 సంవత్సరానికి సంబంధించి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. క్లబ్ లో దాదాపు 4,600 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 1991 మందికి ఓటింగ్ హక్కుఉంది. వీరిలో ఎంత మంది ఓటింగ్ కు హాజరు కానున్నారన్నది పక్కన పెడితే పోటీ చేస్తున్న వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే డా. కెఎల్. నారాయణ, అల్లు అరవింద్, డి. సురేశ్ బాబు ప్యానెల్ అన్ని పోస్టులకు అభ్యర్ధులను నిలిపింది. వీరి ప్యానెల్ లో అధ్యక్షుడిగా జి. ఆదిశేషగిరిరావు, ఉపాధ్యక్షుడుగా తుమ్మల రంగారావు, కార్యదర్శిగా ముళ్ళపూడి మోహన్, కోశాధికారిగా బి. రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వివిఎస్ఎస్ పెద్ది రాజు, కమిటీ మెంబర్లుగా సామ ఇంద్రపాల్ రెడ్డి, మోహన్ వడ్లపట్ల, ఏడిద రాజా, సి.హెచ్. వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు.
అయితే ఈ ప్యానెల్ కి పోటీగా వేరే ఏ ప్యానెల్ లేకున్నప్పటికీ అధ్యక్షపదవిలో యలమంచిలి సురేశ్ కుమార్, ఆర్. సురేశ్ వర్మ, ఉపాధ్యక్ష పదవికి బండ్ల గణేశ్, కార్యదర్శి పదవికి కె.యస్. రామారావు, కోశాధికారిగా కె.సదాశివరెడ్డి, కమిటీ మెంబర్లుగా అనంత శ్రీనివాసరావు సత్తి, ఈటీవీ ప్రభాకర్, ఎం.వి.వి. సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఐదుగురు ప్రమోటీ కమిటీ మెంబర్లకు గాను జె. బాలరాజు, ఎన్. భాస్కర్, ఎ.గోపాలరావు, కె. మురళీమోహన్ రావు, వి. నిరంజన్ బాబు, జె. శైలజ, కాజా సూర్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకూ ఓటింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.
