NTV Telugu Site icon

Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్

Chandrababu Naidu, Pawan Kalyan

Chandrababu Naidu, Pawan Kalyan

Film Chamber Seeks Chandrababu Lokesh Pawan Kalyan Appointment: తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షుడుగా సేవలందిస్తూ, హిందూపురం మూడోసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున ప్రతినిధులు కలిసి అభినందనలు తెలియజేశారన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫోటొలు కూడా రిలీజ్ అవగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mirzapur 3 Trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది..చూశారా?

ఇక తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశం 26-06-2024 న విజయవాడలో జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, హెచ్ ఆర్ డి, ఐ టి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ని కలిసి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుటకు చర్చలు జరపటానికి వారి అపాయింట్మెంట్ కోరినట్టు ఫిలిం ఛాంబర్ ప్రకటిచింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు వి. వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు, కార్యదర్శులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కె. శివప్రసాద రావు పేరుతో లెటర్ రిలీజ్ అయింది.

Show comments