హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించడానికి బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ రెడీ అయ్యాడు. టాప్ గన్ మేవరిక్ రేంజ్ సినిమా చెయ్యాలి అంటే టామ్ క్రూజ్ రేంజ్ హీరో కూడా ఉండాలిగా అందుకే ఇండియన్ టామ్ క్రూజ్ హ్రితిక్ రోషన్ తో టీమ్ అప్ అయ్యాడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ఒకసారి ఈ కాంబినేషన్ లో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా వచ్చింది. ఈ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ బాలీవుడ్ లో ది బెస్ట్ అనిపించుకున్నాయి. ఇప్పుడు ఫైటర్ సినిమాతో మరోసారి కలిసిన సిద్దార్థ్ ఆనంద్, హ్రితిక్ రోషన్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. ఇండియన్ ఫిల్మ్ హల్క్ గా… గ్రీక్ గాడ్ గా హ్రితిక్ రోషన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ గా స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫైటర్ ప్రమోషనల్ కంటెంట్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన మేకర్స్… ఇటీవలే ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
ట్రైలర్ లోని ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉన్నాయి. హ్రితిక్ స్క్రీన్ ప్రెజెన్స్ గాడ్ లెవల్ అంతే. ఏ ఇండియన్ హీరో కూడా హ్రితిక్ కి ఉన్నంత క్యాప్చరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ లేదేమో. దీపికా, అనిల్ కపూర్ లుక్స్ ని కూడా ఫైటర్ ట్రైలర్ లో రివీల్ చేసారు. హ్యూజ్ సెట్స్, ఊహకందని యాక్షన్ బ్లాక్స్ తో ఫైటర్ ట్రైలర్ ప్యాక్డ్ గా ఉంది. ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఓవరాల్ ఒక హాలీవుడ్ రేంజ్ హిందీ సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ జనవరి 25న చూడబోతున్నారు. ఇప్పటికే ఫైటర్ సినిమా ప్రీబుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో టికెట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. జనవరి 25, 26, 27, 28… ఈ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తో హ్రితిక్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు.