బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సూపర్ స్టైలిష్ సినిమా చేసాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ మూవీలో హ్రితిక్ లుక్స్ అండ్ చేసిన స్టంట్స్ హాలీవుడ్ రేంజులో ఉంటాయి. హ్రితిక్ ఆల్మోస్ట్ ఇండియన్ టామ్ క్రూజ్ లా ప్రెజెంట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్… పదేళ్లుగా హిట్ అనేదే తెలియని షారుఖ్ ఖాన్ ని పఠాన్ గా చూపించాడు. స్పై యాక్షన్ సినిమాగా వచ్చిన పఠాన్ వెయ్యి కోట్లు రాబట్టి షారుఖ్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు బ్యాంగ్ బ్యాంగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మరోసారి హ్రితిక్ రోషన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ ఇద్దరి కలయికలో భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న సినిమా ఫైటర్. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇండియాలోనే అత్యధికంగా ఏరియల్ షాట్స్ ఉన్న సినిమాగా ఫైటర్ పేరు తెచ్చుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ సినిమాని తెరకెక్కించాడట. హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్ ప్యాటీ’గా కనిపించనున్న ఈ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది. హ్రితిక్ రోషన్, దీపికా, అనిల్ కపూర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్… లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కి రెడీ అయ్యారు. ఫైటర్ టీజర్ రేపు ఉదయం 11 గంటలకి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. టీజర్ తో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ని రిలీజ్ చేస్తే… జనవరి 25న హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయడం గ్యారెంటీ.
Locked. Loaded. Ready to drop. #FighterTeaser tomorrow.#Fighter Forever 🇮🇳@iHrithik @deepikapadukone @AnilKapoor #KevinVaz @AndhareAjit @itsMamtaA @ramonchibb @ankupande @VishalDadlani @ShekharRavjiani @Iamksgofficial @Akshay0beroi @viacom18studios @MarflixP @TSeries… pic.twitter.com/OoaENVwJjH
— Siddharth Anand (@justSidAnand) December 7, 2023