Fighter movie release banned in Five Gulf countries: ఫైటర్ సినిమా విడుదలకి కొద్దిగంటల ముందు అనుకోని షాక్ తగిలింది. గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలపై నిషేధం విధించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’. ఈ సినిమాలో హృతిక్ రోషన్ – దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 25, 2024న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలను నిషేధించినట్లు తాజాగా వార్తలు అందుతున్నాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్ – దీపికా పదుకొణె ఇంతకు ముందు ఎప్పుడూ కలిసి నటించ లేదు.
Eesha Rebba: అబ్బా.. ఈషా రెబ్బా కూడా మొదలెట్టిందిగా
ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం రిపబ్లిక్ డే సెలవు దినం మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వార్తల ప్రకారం, యుఎఇ మినహా అన్ని గల్ఫ్ దేశాలలో ఫైటర్ సినిమాను బ్యాన్ చేశారు.. UAEలో ఈ చిత్రం PG 15 వర్గీకరణతో సెన్సార్‌ను ఆమోదించింది. జనవరి 10, 2024న సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది, జనవరి 23న దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో ఫైటర్ విడుదల కావడం లేదని ప్రకటించారు. ఇలా బ్యాన్ చేయడం మేకర్స్‌కు దారుణమైన ఎదురు దెబ్బ. సాధారణంగా, గల్ఫ్ దేశాల్లో తీవ్రవాదం లేదా భారత్-పాకిస్తాన్ వివాదాల వంటి అంశాలతో కూడిన సినిమాలు నిషేధించబడతాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా కూడా కువైట్ మరియు ఖతార్‌లలో నిషేధించబడింది. GCC సెన్సార్లు గల్ఫ్ దేశాల్లో క్లియరెన్స్ నిరాకరించినందుకు ఫైటర్ కి 500k నుండి 1 మిలియన్ డాలర్ల వరకు నష్టం ఉండవచ్చు.
