Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో పొడవాటి రూపంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా. కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె నేపథ్యం చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఆమె తన కుటుంబం, మతం మరియు తన కెరీర్ గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఫరియా ఇంట్లో జరిగిన మార్పులు చాలా అరుదైనవి. ఫరియా తండ్రి పుట్టుకతో హిందూ అయినప్పటికీ, తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అలాగే ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించినా, తదనంతర కాలంలో హిందూ మతానికి మారారు.
ఒకే ఇంట్లో భిన్నమైన సంస్కృతులు, మత మార్పిడిల మధ్య పెరిగిన ఫరియా, మతాల కంటే మానవత్వానికి, కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విభిన్నమైన వాతావరణమే తనను ఓ ఓపెన్ మైండెడ్ వ్యక్తిగా తీర్చిదిద్దిందని ఆమె గర్వంగా చెబుతుంటారు.
ఫరియా అచ్చమైన హైదరాబాదీ. ఈ నగరంపై, ఇక్కడి సంస్కృతిపై ఆమెకు విడదీయలేని అనుబంధం ఉంది. కేవలం నటనకే పరిమితం కాకుండా డాన్స్, పెయింటింగ్ వంటి విభిన్న కళల్లో ఆమెకు ప్రవేశం ఉంది. తనలోని ఆ కళాత్మక దృక్పథమే తనను ప్రతి పాత్రలోనూ కొత్తగా ఉండేలా చూస్తుందని ఆమె నమ్ముతారు. ఇప్పటివరకు ఫరియా అంటే కేవలం ‘క్విర్కీ’ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుందని అందరూ అనుకునేవారు. కానీ ‘గాయపడ్డ సింహం’ సినిమాలో ఆమె పోషించిన ‘షాలిని’ పాత్ర ఆ అంచనాలను తలకిందులు చేయబోతోందని చెబుతోంది. ఈ పాత్రలో ఫరియా మునుపెన్నడూ చూడని విధంగా చాలా సీరియస్ లుక్‌లో కనిపించనున్నారు. కేవలం గ్లామర్కో, కామెడీకో పరిమితం కాకుండా తనలోని అసలైన నటిని బయటకు తీసే పాత్ర ఇది అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!