NTV Telugu Site icon

Faria Abdullah: యాక్టింగ్ మాత్రమే కాదు అంతకు మించి!

Ravanasura

Ravanasura

Ravanasura: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది.

‘రావణాసుర’ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లాయర్ కనక మహాలక్ష్మిగా నటిస్తోంది. అయితే ఇది తన గత చిత్రం ‘జాతిరత్నాలు’లోని లాయర్ పాత్ర లాంటిది కాదని చెప్పింది. “ఇందులో రవితేజ సీనియర్ లాయర్. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా చేస్తాను. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. కోర్టు సీన్స్ తక్కువే. అయితే ప్రొఫెషన్ పరంగా పాత్ర కీలకమైంది. మ్యారీడ్ విమెన్ పాత్ర కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం పరిణితతో ఉంటుంది. ఇందులో ఫ్లాప్ బ్యాక్ లో వచ్చే బ్రేకప్ సాంగ్ లో నటించాను. ఆ పాట షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. రవితేజ గారితో పని చేయడం నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం. బ్రేక్ లో కాసేపు ఆయనతో మాట్లాడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రవితేజ చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. సెట్ లో అందరినీ చాలా కంఫర్ట్ బుల్ గా ఉంచుతారు. ఆయన నుంచి సహనం నేర్చుకున్నాను” అని తెలిపింది.

దర్శకుడు సుధీర్ వర్మ గురించి చెబుతూ, “ఈ కథను రైటర్ శ్రీకాంత్ చెప్పారు. విన్నప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సుధీర్ వర్మ చాలా క్లారిటీ వున్న దర్శకులు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్” అని చెప్పింది. తన కెరీర్ ప్లానింగ్ గురించి వివరిస్తూ, “త్వరగా ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఆలోచన లేదు. నా ప్రయాణంపై నాకు స్పష్టత వుంది. మరో ఐదేళ్ళలో ఎక్కడ ఉంటానో ఒక అంచనా వుంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తొందరపడను. నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. అవకాశాలు వస్తాయా రావా అనే భయం కూడా లేదు. బేసికల్ గా నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. నెగిటివ్, యాక్షన్, పిరియాడిక్ ఇలా భిన్నమైన పాత్రలు చేయాలనుకుంటాను. అలానే దర్శకత్వం వహించాలని, ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి రావాలని కూడా ఉంది. అయితే దానికి మరికొంత సమయం పడుతుంది. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో ఒక్కో సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి” అని చెప్పింది.

Show comments