NTV Telugu Site icon

Farhana: ‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ: ఐశ్వర్య రాజేశ్‌

Ish

Ish

Aishwarya Rajesh: ‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తాజాగా ‘ఫర్హానా’ చిత్రాన్ని నిర్మించింది. తమిళంలో ”మాన్‌ స్టర్‌, ఒరు నాల్‌ కూత్తు” చిత్రాలు అందించిన నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఇదే నెల 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో యూనిట్ మీడియాతో సమావేశమైంది.

తొలుత ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, “‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ. నా మీద నమ్మకంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాషల్లో రిలీజ్ చేస్తోంది. ఒక ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. నెల్సన్ గారి చిత్రాలు యూనిక్ గా వుంటాయి. ‘ఫర్హానా’ కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో చాలా బరువైన పాత్ర, ఇంటెన్స్ రోల్ చేశాను. షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక సవాల్ గా ఉండేది. అన్నీ లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ఇంత బరువైన పాత్రని నేను మోస్తానని నమ్మిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు.

తెలుగు ఇండస్ట్రీ ఇంజన్ ఆఫ్ ఇండియన్ సినిమా: నెల్సన్
దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ, “ఇది నా మూడో సినిమా. దేశంలో మోస్ట్ ప్యాషనేట్ ఆడియన్స్ తెలుగు రాష్ట్రాలలో వున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇంజన్ ఆఫ్ ఇండియన్ సినిమా. తెలుగు సినిమాల వాటి గ్లోబల్ ఇంపాక్ట్ సౌత్ ఇండియన్ సినిమాని గొప్ప స్థాయికి తీసుకు వెళుతున్నాయి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివికమ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు.. ఇలా అందరి ప్రజన్స్ తో ”మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్” ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ రోజు తెలుగు సినిమా ఉన్నత స్థానంలో వుంది. ఈ మధ్య కాలంలో నాని ‘దసరా’ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. చాలా నచ్చింది. నాని కి బిగ్ ఫ్యాన్ అయిపోయా. కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. ‘ఫర్హానా’ అలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రం. ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. జస్టిన్ ఇప్పటికే తెలుగు లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ ఒక ఎస్సెట్. నా మూడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది పక్కా తెలుగు సినిమాలా వుంటుంది” అని అన్నారు.

నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ, “గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ విడుదల చేశాం, ప్రేక్షకులు దానిని అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు ‘ఫర్హానా’ తో వస్తున్నాం. ‘ఫర్హానా’ చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమా అనిపించింది. ఫైనల్ కాపీ చూసి ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నెల్సన్ తో మాకు ఇది రెండో సినిమా. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. చాలా నిజాయితీ గల దర్శకుడు. ఐశ్వర్య రాజేష్ తో పాటు అందరూ అద్భుతంగా నటించారు. మేం ఎలా అయితే ఎంజాయ్ చేశామో ప్రేక్షకులు కూడా తప్పకుండా సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ మాట్లాడుతూ, నేపధ్య సంగీతం చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించిందని అన్నారు. ఐశ్వర్య రాజేష్ కి నేను పెద్ద ఫ్యాన్ అని , తనతో కలసి నటించడం ఆనందంగా వుందని, ఆమె నుంచి చాలా నేర్చుకున్నానని ఐశ్వర్య దత్తా తెలిపింది. ఈ కార్యక్రమంలో జితన్ రమేశ్ కూడా పాల్గొన్నారు.