Site icon NTV Telugu

Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

Akshaye Khanna

Akshaye Khanna

Akshaye khanna: బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా వరసగా హిట్స్ ఇస్తున్నారు. ధురంధర్, చావా సినిమాలతో హీరోను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించినప్పుడు కూడా ఈ క్రేజ్ రాలేదు. ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌లో ఇరుగదీస్తున్నాడు. అయితే, అక్షయ్ కన్నా గురించి కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు తాను అక్షయ్‌తో పనిచేయాలంటే మానసిక వేధన( ట్రామా) అనుభవించినట్లు ఫరాఖాన్ చెప్పారు.

ఫరా ఖాన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆమె తన సినిమా ‘‘తీస్ మార్ ఖాన్’’ గురించి కీలక విషయాలు చెప్పారు. ఈ చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం అక్షయ్ ఖన్నాను ఎంపిక చేయడానికి ముందు, తాను షర్మాన్ జోషిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. షర్మాన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో, ఆ పాత్ర అక్షయ్ ఖన్నాకు దక్కినట్లు చెప్పారు. తన సినిమాకు లాస్ట్ ఛాయిస్ అక్షయ్ ఖన్నానే అని, చివరకు ఆయననే సినిమాలోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

బట్టతల కారణంగా అక్షయ్ ఖన్నా బాధ:

90వ దశకంలో అక్షయ్ ఖన్నా ప్రవర్తన బాగా లేదని ఫరా అన్నారు. ఆయన చాలా చిరాకుగా ఉండే వారిన, వస్తువుల్ని విసిరేసే వారని, డైలాగుల విషయంలో గొడవ పడేవారని ఆమె చెప్పారు. ఆయన నటించే సినిమాలకు డేట్స్ లేవని చెప్పేదానినని ఫరా వెల్లడించారు. ఆ సమయంలో అక్షయ్ ఖన్నా జట్టు రాలడం(బట్టతల) సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యేవారని, అదే ఆయన కోపానికి కారణమని ఫరా వెల్లడించారు. తన బట్టతలను దాచుకోవడానికి ఆయన ఎప్పుడూ టోపీ ధరించే వారని, తాల్ సినిమా వర్షం సాంగ్‌లో కూడా టోపీతోనే కనిపించిన విషయాన్ని చెప్పారు.

ఫర్హాన్ అక్తర్ ‘‘దిల్ చాహ్తాహై’’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయినట్లు ఫరా చెప్పారు. తన లుక్ గురించి, బట్టతల గురించి ఆయనలో స్పష్టత వచ్చి పూర్తిగా మారిపోయినట్లు ఫరా చెప్పారు. ఈ సినిమాలో ‘‘కోయి కహే కెహతా రహే’’ పాటలో అక్షయ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారని ఆమె కితాబిచ్చారు. ఇటీవల ధురంధర్ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయ్యానని, వెంటనే ఆయనకు ఫోన్ చేసి, అలీబాగ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి మరీ అభినందించిన విషయాన్ని చెప్పారు. అక్షయ్‌కు అనవసర హడావిడి, షో ఆఫ్ అంటే నచ్చదని, తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె చెప్పారు.

Exit mobile version