కమల్ హాసన్ … ఆల్వేస్ ఏ లయన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్ బాలనటునిగా నటించిన తొలి చిత్రం ‘కలత్తూర్ కన్నమ్మ’ 1960 ఆగస్టు 12న విడుదలయింది. అంటే కమల్ నటునిగా జనం ముందునిలచి 61 ఏళ్ళు పూర్తయి, 62వ యేట అడుగుపెట్టారన్నమాట! ఈ సందర్భంగా కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులోనే ‘ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…’ అనే మాటలను జోడించారు. ఈ పదాలు కమల్ అభిమానులకు ఉత్సాహం కలగిస్తున్నాయి. ఈ సందర్భంగా కమల్ ను అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీపరిశ్రమకు చెందిన పలువురు అభినందించారు.
నటునిగా కమల్ హాసన్ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున ఉన్నారని ఆయన సమకాలికులు సైతం అంగీకరిస్తారు. ఇక నేషనల్ అవార్డ్స్ లో తొలిసారి మూడు సార్లు ఉత్తమనటునిగా అవార్డులు సొంతం చేసుకుని చరిత్ర కెక్కారు కమల్. మొత్తం 19 ఫిలిమ్ ఫేర్ అవార్డులతోనూ అగ్రగామిగా సాగుతున్నారు కమల్. ఇంతటి నటజీవితం ఉన్న కమల్ ఎన్నెన్నో ఘనవిజయాలు చూశారు. పరాజయాలనూ పలకరించారు. ప్రయోగాలూ చేస్తూ సాగుతున్నారు. అయితే మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి కమల్ హాసన్ పరాజయం చవిచూశారు. ఆయన పార్టీ తరపున నించున్న అందరూ ఓటమి బాటనే పట్టారు. ఆయన కూడా ఓడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించిన మాట వాస్తవం. మళ్ళీ అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు అన్నట్టుగా ఇప్పుడు కమల్ హాసన్ తాజా చిత్రం ‘విక్రమ్’ పోస్టర్ విడుదలయింది. అందులో ‘ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అనే మాటలు కమల్ ఫ్యాన్స్ కు ఉత్సాహం కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.
Also Read
- Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
- Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
- Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!