Site icon NTV Telugu

Sonu Sood: పిచ్చండీ ఇది.. సోనూసూద్ కోసం 1500 కి.మీ పరిగెత్తుకొచ్చిన ఫ్యాన్!

North Railways On Sonusood

North Railways On Sonusood

Fan Ran 1500 Km From Delhi To Mumbai Just To Meet Fateh Actor Sonu Sood : నటుడు సోనూసూద్ నటనతో పాటు సామాజిక సేవలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఆయన్ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఇటీవల ఓ అభిమాని ఆయన్ను కలిసేందుకు 1500 కిలోమీటర్లు పరిగెత్తడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందిలో అభిమానం ఉంది. నటనతో పాటు సామాజిక సేవలో కూడా ఆయనను చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆయన కరోనా కాలంలో చాలా మంది నిరుపేదలకు సహాయం చేశాడు. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం ప్రజలతో కనెక్ట్ అవుతూ వాళ్ళ బాధలు తీరుస్తూ ఉంటాడు. దీంతో అభిమానులు ఆయన్ని ఆరాధిస్తారు. ఇటీవల ఓ అభిమాని అతన్ని కలవడానికి ఢిల్లీ నుంచి ముంబైకి 1500 కిలోమీటర్లు పరిగెత్తాడు.

Pushpa 2 : పుష్ప 2 క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది .. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..

అభిమానుల పిచ్చికి సంబంధించిన ఇలాంటి వార్తలు మనం నిత్యం చదువుతూనే ఉంటాం. తాజాగా, నటుడు సోనూసూద్ అభిమాని కూడా అలాంటిదే చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, మహేష్ అనే అభిమాని నటుడిని కలవడానికి 1500 కి.మీ రన్నింగ్ చేశాడు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుండి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు పరిగెత్తుతూ వచ్చాడని చెబుతున్నారు. సోనూ సూద్ తన అభిమానిని కలిసిన తర్వాత ఫోటోలు కూడా దిగాడు. ఇక ఈ క్రేజీ ఫ్యాన్, సోనూసూద్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమాల గురించి చెప్పాలంటే సోను త్వరలో సైబర్ క్రైమ్‌కి సంబంధించిన థ్రిల్లర్ చిత్రంలో తెరపై కనిపించనున్నారు. ఆ సినిమా పేరు ‘ఫతే’. ఈ సినిమాలో ఆయనతో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కనిపించనుంది. ఈ చిత్రానికి సోనూ స్వయంగా దర్శకత్వం వహించారు. మీడియా కథనాల ప్రకారం, అతను సైబర్ క్రైమ్ బాధితులకు సహాయం చేసే టెక్ లవర్ పాత్రలో కనిపిస్తాడు.

Exit mobile version