Family Star is his Biopic Says Vijay Deverakonda: ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ చెన్నై ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు. అయితే అక్కడ సినిమాని ప్రమోట్ చేసే విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నాడు విజయ్. తాజాగా ఈ సినిమా ఒక బయోపిక్ అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Tillu Square: టిల్లు స్క్వేర్ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. కానీ అక్కడే ట్విస్టు!
‘
తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అని, ఇలాంటి కథలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అంతే కాదు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని పరశురామ్ ఈ కథ రాశాడని.. అది విన్నప్పుడు హీరో పాత్ర నిజ జీవితానికి దగ్గర ఉందనిపించిందని చెప్పుకొచ్చాడు. ఒక రకంగా ఇది పరశురాం బయోపిక్ అని విజయ్ దేవరకొండ చెప్పినట్లు అయింది. నిజానికి పరశురాం సొంత ఊరు నర్సీపట్నం. అదే ఊరికి చెందిన పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి పరశురాం దర్శకుడు స్థాయికి ఎదిగాడు. అయితే కొన్ని సందర్భాల్లో తన ప్రేమ కథ గురించి పరశురాం చెబుతూ ఉండేవారు. ఆ ప్రేమ కథనే సినిమాగా మరిచారా లేక విజయ్ దేవరకొండ సరదాగా ఈ కామెంట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.
