Site icon NTV Telugu

Crime News : వెల్గటూర్ లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్..

Crime

Crime

Crime News : నకిలీ కరెన్సీతో ప్రజలను దోచుకుంటున్న ముఠాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను వెల్గటూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్ల రంగు పేపర్ ని రసాయనంలో పెట్టి అచ్చు ఒరిజినల్ నోట్లగా మార్చేసి ప్రజలకు అంటగడుతున్నారు. నిందితులు ఊర్లలోకి వెళ్లి.. అమాయకుల దగ్గరి నుంచి అసలు నోట్లు తీసుకుని నకిలీ నోట్లు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అసలు నోట్లు రూ.7 లక్షల విలువ చేసే నోట్లు తీసుకుని.. నకిలీ 32 లక్షల రూపాయల నోట్లు ఇస్తూ మోసం చేస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
Read Also : Rajinikanth : రజినీకాంత్ ’కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ నెలలోనే..

వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద నోట్లు మార్చుకోనుచుండగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి ఒక కారు, బైక్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.2,04000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 6 నలుపు రంగు నోట్లు, ఐదు వందల నోటును ముద్రించే బొమ్మ కరెన్సీని కూడా సీజ్ చేశారు. ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్ట్ కు పంపించారు.

Read Also : LIC Jeevan Shanti: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం ఒక లక్ష పెన్షన్..!

Exit mobile version