NTV Telugu Site icon

Raveena: తప్ప తాగి కేజిఎఫ్ నటి దాడి.. అసలు విషయం బయటపెట్టిన పోలీసులు

Raveena Tandon News

Raveena Tandon News

Facts Behind Raveena Tondon Attack Video Controversy: ఈ శనివారం రాత్రి జరిగిన ఓ ఘటనలో నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్ మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు లేవని ఇరువర్గాల నుంచి లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ క్రమంలో ఖార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘ఫిర్యాదుదారు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. మేము సొసైటీలోని పూర్తి CCTV ఫుటేజీని తనిఖీ చేసాము, కుటుంబం ప్రయాణిస్తున్న కారును దాటినప్పుడు రవీనా డ్రైవర్ కారును రోడ్డు నుండి సొసైటీలోకి రివర్స్ చేస్తున్నాడని కనుగొన్నామని అన్నారు. కుటుంబీకులు కారును ఆపి డ్రైవర్‌కు రివర్స్ చేసే ముందు వెనుక ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేయాలని చెప్పారు. ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే రవీనా కారు ఎవరినీ ఢీకొట్టలేదని, రవీనా తన డ్రైవర్‌కు ఏం జరిగిందో చూసేందుకు అక్కడికి వచ్చిందని చెప్పారు. నటి తన డ్రైవర్‌ను ఆ గుంపు నుండి రక్షించడానికి ప్రయత్నించింది.

Sajjala Ramakrishna Reddy: వారి సంబరాలు తాత్కాలికమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం..

అయితే గుంపు ఆమెపై విరుచుకు పడడం ప్రారంభించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కారు ఎవరినీ ఢీకొట్టలేదని, రవీనా కూడా తాగి లేదని తేలింది. ముంబయిలోని బాంద్రాలోని రిజ్వీ లా కాలేజీ సమీపంలో తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బాధితురాలి కుమారుడు గతంలో పేర్కొన్నాడు. దీంతో రవీనా డ్రైవర్‌ కారు దిగి ఆమె తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రవీనా కూడా కారు దిగి వారితో గొడవకు దిగింది. బయటపడిన ఈ వీడియోలో, రవీనాను బాధితురాలి కుటుంబం మరియు స్థానిక జనం చుట్టుముట్టారు. పోలీసులను పిలిపించడం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో, బాధిత మహిళ కుమార్తె రవీనాతో, ‘నువ్వు రాత్రంతా జైల్లోనే గడపాలి, నా ముక్కు నుంచి రక్తం కారుతోంది అని అనడం, ‘దయచేసి నన్ను నెట్టకండి.. కొట్టకండి…’ అంటూ జనాలను ఉద్దేశించి రవీనా చెప్పడం వినిపించింది. ఈ వీడియోను చిత్రీకరించవద్దని అక్కడ ఉన్న అక్కడ ఉన్నవారిని ఆమె అభ్యర్థిస్తోంది.

Show comments