వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మే 27న “ఎఫ్3” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 22న “ఊ ఆ ఆహా” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
Read Also : Ilayaraja : రాజ్యసభకు మ్యూజిక్ మాస్ట్రో ?
ఇక ప్రస్తుతం “ఎఫ్ 3” మూవీ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇటీవలే పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు మేకర్స్. ఇక సినిమాలో నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ “డబ్బు” అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సమ్మర్ సోగ్గాళ్ళ రాక కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
