మసూద, కాంచన, చంద్రముఖి, రాత్రి, దెయ్యం లాంటి హారర్ సినిమాలని చూసి చాలా మంది భయపడి ఉంటారు. వీటినే బెస్ట్ హారర్ సినిమాలు అనుకుంటూ ఉంటాం కూడా బట్ డీప్ డౌన్ ఎక్కడో మన అందరికీ హారర్ సినిమా అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చూసిన, ప్రతి ఒక్కరినీ భయపెట్టిన ఆ సినిమా పేరు ‘ఈవిల్ డెడ్’. సినిమా భాషలో చెప్పాలి అంటే ఈవిల్ డెడ్ సినిమాని ఒంటరిగా చూస్తే గులాబ్ జాములు గడగడ లాడిపోతాయి అని ప్రేమ కథా చిత్రంలో సప్తగిరీ చెప్పిన డైలాగ్ పర్ఫెక్ట్ గా ఆప్ట్ అవుతుంది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి 1981లో మొదటిసారి ‘ది ఈవిల్ డెడ్’ అనే పేరుతో ఒక సినిమా బయటకి వచ్చింది. హారర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వణుకు పుట్టించడం ఎలాగో నేర్పించిన ఈ సినిమా రిలీజ్ అయిన ఆరేళ్ళకి(1987లో) ‘ఈవిల్ డెడ్ 2’ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆరేళ్ళకి అంటే 1993లో ‘ఆర్మీ ఆఫ్ డార్క్ నెస్’ అనే సినిమా వచ్చింది. ఒకే కథకి సీక్వెల్స్ లా వచ్చిన ఈ సినిమాలు హారర్ సినిమాలకి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. మూడో పార్ట్ లో హారర్ పార్ట్ కాస్త తగ్గి యాక్షన్ పార్ట్ ఎక్కువ అవ్వడంతో ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా కొన్నేళ్ల పాటు రాలేదు. దీంతో ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ ఎండ్ అయ్యిందేమో అని అంతా అనుకున్నారు.
‘ఆర్మీ ఆఫ్ డార్క్ నెస్’ రిలీజ్ అయిన పదకొండేళ్ళకి 2013లో ‘ఈవిల్ డెడ్’ అనే పేరుతోనే ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా వచ్చింది. ఇది ముందు వచ్చిన మూడు సినిమాల కథలతో సంబంధం లేకుండా రూపొందిన చిత్రం. తాజాగా ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజ్ నుంచి మరో స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ బయటకి రానుంది. ‘ఈవిల్ డెడ్ రైజ్’ అనే పేరుతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అక్షరాల 6500 లీటర్ల డమ్మీ రక్తాన్ని ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా కోసం వాడారు అంటే ఈ సినిమా ఎంత హారిఫయ్యింగ్ గా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ‘ఈవిల్ డెడ్’ అనే బ్రాండ్ ని నిలబెడుతూ, ముందు వచ్చిన సినిమాల కన్నా ఎక్కువ భయపెట్టేలా కట్ చేసిన ట్రైలర్ ఒళ్ళు గగ్గురుపొడిచేలా చేస్తోంది. ట్రైలర్ కట్ ఈ రేంజులో ఉంటే ఇక ఫుల్ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆలోచనకే థియేటర్స్ కి వెళ్లాలి అంటే ఆలోచించాల్సిన వస్తోంది. అలా ఆలోచిస్తాం కానీ థియేటర్ కి వెళ్లి లార్జ్ స్క్రీన్ పైన హారర్ సినిమా చూడకుండా ఉండగలమా? అందరం మూకుమ్మడిగా వెళ్లి ‘ఈవిల్ డెడ్ రైజ్’ చూసి భయపడి థియేటర్స్ నుంచి బయటకి వస్తాము, అది ఎలాగో జరిగేదే. ఏప్రిల్ 21న విడుదల కానున్న ఈవిల్ డెడ్ రైజ్ సినిమాని ‘లీ క్రోనిన్’ డైరెక్ట్ చేశాడు.
Witness the mother of all evil in the official trailer for Evil Dead Rise – only in theaters April 21. #EvilDeadRise pic.twitter.com/CMtitMZumK
— Evil Dead (@EvilDead) January 4, 2023
