యంగ్ టైగర్ గాండ్రించబోతున్నాడు! జెమినీ టీవీలో ‘రొరింగ్ దిస్ ఆగస్ట్’ అంటూ ప్రచారం జోరందుకుంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తాజా ప్రోమో అప్పుడే ఫ్యాన్స్ ని పండగ మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది!
తారక్ కి బుల్లితెర కొత్తేం కాదు. అయితే, గతంలో ‘మా’ టీవీలో అలరించన ‘బిగ్ బాస్’ ఈసారి జెమినీ టీవీలో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి, డబ్బులు కూడా పంచి పెట్టబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వర్షన్ లాంటి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షోకి జూనియర్ హోస్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ విషయం గతంలోనే జనానికి తెలిసినా తాజాగా ప్రోమో విడుదల కావటంతో మరోసారి నెటిజన్స్ లో ఉత్సాహం పెల్లుబుకింది!
‘పెద్దయ్యాక అమ్మని కావాలనుకుంటున్నాను’ అని చెప్పే ఓ ‘యాంబీషియస్ గాళ్’తో ప్రోమో నడుస్తుంది! వాళ్ల అమ్మ తమని ఎంతో కష్టపడి పెంచి, పెద్ద చేసిందని చెప్పే సదరు కంటెస్టెంట్… తాను కూడా ‘అమ్మ’గా మారి భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దుతానని అంటుంది! ఎమోషనల్ గా సాగే ప్రోమో చివర్లో ఎన్టీఆర్ ‘ఇక్కడ మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకోవచ్చు’ అంటాడు! చూడాలి మరి, ఇదే నెలలో మనల్ని అలరించబోతోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం తారక్ సమర్పణలో ఎలా ఉండబోతోందో!
