సమాజం మారుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న డైరెక్టర్లు.. ఇక కథను బట్టి పెదవి ముద్దులు, నగ్న సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి. హాలీవుడ్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల ‘యుఫోరియా’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన నటి మింకా కెల్లీ డైరెక్టర్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
“ఈ సిరీస్ కోసం డైరెక్టర్ తనను నగ్నంగా నటించమని అడిగారు.. ఆ సీన్ ఎప్పుడు వస్తుందో కూడా వివరించారు. నిజం చెప్పాలంటే ఆయన అలా అడగడంలో కూడా తప్పులేదు. ఆ పాత్రకు.. ఆ సమయంలో నగ్నంగా నటిస్తేనే ఆ సీన్ రక్తి కడుతుంది. కానీ, నేను అందరి ముందు బట్టలు విప్పలేనని చెప్పను.. బట్టలతోనే చేస్తే బావుంటుందని కోరాను. అందుకు ఆయన మారుమాట్లాడకుండా నేను ఎలా చెప్తే అలాగే చేశారు. ఆ తరువాత ఆసీన్ ఎంతో మంచి పేరు తెచ్చింది” అని చెప్పుకొచ్చింది. కొంతమంది డైరెక్టర్లు హీరోయిన్ మాట వినేది ఏంటి అని, డైరెక్టర్ చెప్పిందే చేయాలని పట్టు బడుతుంటారు.. కానీ ఈ డైరెక్టర్ హీరోయిన్ మాటకు గౌరవమిచ్చి సీన్ చేయడం గొప్ప విషయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
