చైతన్య చిలిపి చేష్టలు.. దక్ష కొంటె నవ్వులు..’ఎంత సక్కగుందిరో’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో జాంబీ రెడ్డి ఫేమ్ దక్ష నగర్కార్ మెరిసింది. ‘ఎంత సక్కగుందిరో’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ సంక్రాంతి పండగను గుర్తుచేస్తోంది.
వయ్యారాలు పోతున్న దక్షను చూస్తూ.. ఆమె అందాలను చిన బంగార్రాజు పొగడడం.. దానికి దక్ష సిగ్గుపడడం చూస్తుంటే సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని అనసూయ సాంగ్ గుర్తుకొస్తుంది.. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోను సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో బంగార్రాజు మాత్రమే ఉంది. సినీ అభిమానులందరూ కుటుంబాలతో కలిసి వెళ్ళడానికి సంక్రాంతిలాంటి సినిమా అని నాగార్జున తెలుపుతున్నారు. మరి ఈ సినిమా ఈ సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!