NTV Telugu Site icon

Naa Saamiranga: ఈ సాంగ్ ఇంత ఎమోషనల్ గా ఉందేంటి?

Naa Saamirana

Naa Saamirana

కింగ్ నాగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. సరిగ్గా భోగి పండగ రోజున రిలీజ్ అవనున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. సంక్రాంతి సినిమాల లిస్టులో అన్నింటికన్నా లాస్ట్ గా రిలీజ్ అవుండడం నా సామిరంగ సినిమాకి బాగా కలిసొచ్చే విషయం. గుంటూరు కారం సినిమాకి నా సామిరంగ సినిమాకి మధ్య రెండు రోజుల గ్యాప్ ఉంది… పండగ రోజున కొత్త సినిమాకి వెళ్లాలి, కుటుంబంతో పాటు వెళ్లి చూడాలి అనుకుంటారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి అడుగు నా సామిరంగ సినిమా వైపే పడుతుంది. టాక్ కాస్త బాగుంటే చాలు సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు తర్వాత నాగార్జున ఖాతాలో మరో హిట్ పడినట్లే.

నా సామిరంగ సినిమాపై అంచనాలు పెంచుతూ మంచి ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సాంగ్స్, టీజర్ లు నా సామిరంగ సినిమాకి పాజిటివ్ బజ్ జనరేట్ చేసాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి విజిల్ సాంగ్ అనే పాట రిలీజ్ అయ్యింది. కీరవాణి లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ఈ పాట అల్లరి నరేష్, నాగార్జునలపైన డిజైన్ చేసారు. “అంజిది కిష్టయ్యది విడదీయని ఒక అనుబంధం” అనే లిరిక్స్ ని చూస్తేనే నాగార్జున-అల్లరి నరేష్ మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇది వర్కౌట్ అయితే నా సామిరంగ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. మరి జనవరి 14న నాగార్జున నా సామిరంగ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

Whistle Theme Song | Naa Saami Ranga | Nagarjuna Akkineni | AllariNaresh | VijayB | MM Keeravaani