Site icon NTV Telugu

Sasivadane: మరో సూపర్ సాంగ్ వచ్చేసింది!

Sasivadane

Sasivadane

Sasivadane Song Released: తెలుగులో ఓ స్వచ్చమైన విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు అలాంటి ఫ్రెష్ ఫీల్ ఇస్తు శశివదనే అనే సినిమా ఒకటి వస్తోంది. ‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సాయి మోహ‌న్ ఉబ్బ‌న డైరెక్ట్ చేస్తుండగా.. ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవర డేట్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమా.. ఏప్రిల్ 5న రిలీజ్‌కు రెడీ అవుతోంది. బ్యూటిఫుల్ విలేజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మంచి బజ్ జనరేట్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

March OTT Releases: మార్చిలో ఓటీటీకి రాబోతున్న సినిమాలు-రిలీజ్ డేట్లు ఇవే!

మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్స్‌ అదిరిపోయాయి. శశివదనే టైటిల్ సాంగ్‌, డీజె పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా.. డీజె పిల్ల సాంగ్‌ హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో రీల్స్‌తో వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్‌గా మరో సూపర్ మెలోడి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏమిటో.. ఏమిటో అంటు సాగే ఈ సాంగ్‌ను సింగర్ PVNS రోహిత్ పాడగా.. కరుణాకర్ అడిగర్ల లిరిక్స్ అందించాడు. జేడి మాస్టర్ ఖోరియోగ్రఫి చేశాడు. సినిమాలో ఈ సాంగ్ హీరో, హీరోయిన్‌ను చూడగానే హమ్ చేసేలా ఉంది. రక్షిత్ అట్లూరి -కోమలీ పెయిర్ బాగుంది. వింటుంటే వినాలనిపించేలా.. స్లో పాయిజన్‌లా ఎక్కేలా ఉన్న ఈ మెలోడి.. విజువల్స్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది. మేకర్స్ కూడా.. ఈ పాటతో తమ సినిమా మరో మెట్టు ఎక్కుతుందని నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టే.. ఈ బ్యూటీఫుల్ ట్రాక్‌ ఉందనే చెప్పాలి. చిన్న సినిమా అయినా కూడా సాంగ్స్‌తో ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది శశివదనే. మొత్తంగా.. ఈ సినిమాతో తెలుగులో చాలా రోజుల ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నట్టే ఉంది.

Exit mobile version