NTV Telugu Site icon

Tiger Nageswara Rao : ఏక్ దమ్ ఏక్ దమ్ అంటున్న టైగర్..

Ek Dum Ek Dum

Ek Dum Ek Dum

Ek Dum Ek Dum Lyrical song From Tiger Nageswara Rao Released : మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి ది పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” ఏక్ దమ్ ఏక్ దమ్ “పాటను 5 భాషల్లో విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ భారతదేశంలోని అతిపెద్ద గజదొంగగా భావించే టైగర్ నాగేశ్వరరావు జీవితకథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అతని ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు సినిమాలోని ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు నాలుగు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌స్ గ్రాండ్ గా ప్రారంభించారు.

Balagam Actor Died: తీవ్ర విషాదం.. బలగం నటుడు కన్నుమూత

‘’ఏక్ దమ్ ఏక్ దమ్’ అంటూ సాగుతున్న పాట పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఏక్ దమ్ ఏక్ దమ్ పాటలో డ్యాన్స్ రిథమ్స్ ఎక్స్ట్రార్డినరి అని చెప్పకతప్పదు. భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఈ సాంగ్ అలపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించిన ఈ సాంగ్ కి పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రెండీ హుక్ స్టెప్‌ను క్రియేట్ చేశారు. రవితేజ యంగ్ గా కనిపించారు. అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.