Site icon NTV Telugu

Casino Case: హీరోయిన్ల బాగోతాలు బట్టబయలు.. మరీ అంతనా?

Actress Casino Case

Actress Casino Case

Eesha Rebba Mumaith Khan Took Hefty Remuneration For Casino Promotion: క్యాసినోల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులైన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు సంబంధించిన ఫామ్ హౌస్, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం.. విచారణకు పిలిపించడం అంతా జరిగింది. ఈ నేపథ్యంలోనే.. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాదు.. తన క్యాసినోలకు ప్రమోట్ చేసేందుకు చికోటి కొందరు హీరోయిన్లతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాడని, అందుకు వారికి భారీ పారితోషికాలు సమర్పించాడని వెలుగులోకి వచ్చింది. ఆ హీరోయిన్లలో అమీషా పటేల్, ఈషా రెబ్బా, ముమైత్ ఖాన్, డింపుల్ హయాతి, మల్లిక షెరావత్‌లు ఉన్నట్టు తేలింది. క్యాసినో ప్రమోషన్‌కి గాను మల్లికా షెరావత్ రూ. 1 కోటి, తెలుగమ్మాయి ఈషా రెబ్బా రూ. 40 లక్షలు అందుకున్నట్టు సమాచారం. ఇక అమీషా పటేల్‌కు రూ. 80 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ. 15 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు ముట్టినట్టు తెలుస్తోంది. దీంతో.. పారితోషకం అందుకున్న తారలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

అయితే.. చికోటి ప్రవీణ్ మాత్రం తానేమీ ఇల్లీగల్ దందా చేయట్లేదని, నేపాల్ & గోపాల్ క్యాసినో చట్టబద్ధమేనని, తాను చట్టబద్ధమైన వ్యాపారమే చేశానని పేర్కొన్నాడు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, సోమవారం కూడా విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పారన్నాడు. తాను విచారణకు హాజరై, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానన్నాడు. తానూ సామాన్య వ్యక్తినని, కేవలం క్యాసినో వ్యవహారంలోనే ఈడీ దాడులు నిర్వహించినట్టు వివరించాడు.

Exit mobile version