Site icon NTV Telugu

Allari Naresh: అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

Allari Naresh Grand Father Died

Allari Naresh Grand Father Died

ప్రముఖ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాతయిన ఈదర వెంకట్ రావు సోమవారం (జనవరి 19) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, 90 ఏళ్ల వయసులో మరణించారు.

Also Read :Krishnam Raju: 28 ఏళ్ల ఏజ్ గ్యాప్.. నిరాహార దీక్ష.. కృష్ణంరాజు రెండో పెళ్లి వెనుక షాకింగ్ విషయాలు?

వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019, మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు, రెండో కుమారుడు: ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు: ఇ.వి.వి. శ్రీనివాస్ కుమార్తె: ముళ్ళపూడి మంగాయమ్మ. ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు ఆయన స్వయానా తాతగారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటప్పయ్య పార్థివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఈదర కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Exit mobile version