NTV Telugu Site icon

Ee Nagaraniki Emaindi: గ్యాంగ్స్ తో వచ్చి రచ్చ చేస్తున్నారు మైక్…

Ene

Ene

ఈ నగరానికి ఏమైంది అనే ఒక సినిమా… నలుగురు కొత్త కుర్రాళ్లు నటించిన ఒక సినిమాకి కల్ట్ స్టేటస్ వస్తుంది… దాని రీరిలీజ్ కోసం యూత్ అంతా వెయిట్ చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది గత అయిదేళ్లలో  మీమ్స్ రూపంలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ వచ్చింది. మొదటిసారి రిలీజ్ అయినప్పుడు కొంతమందికి మాత్రమే కనెక్ట్ అయిన ఈ మూవీ, ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇస్తూ రీరిలీజ్ అయిన రెండు రోజుల్లో 2.30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొత్త సినిమాల పరిస్థితే అంతంతమాత్రంగా ఉన్న టైమ్ లో ఈ నగరానికి ఏమైంది సినిమా తన కల్ట్ స్టేటస్ ని నిరూపిస్తోంది. థియేటర్స్ కి ఆడియన్స్ తమ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో పోయి, సినిమాలోని ప్రతి డైలాగ్ ని చెప్తూ ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ సీన్ కి, బార్ లో తాగుదాం, నేను యాక్టర్ సీన్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీన్ వచ్చే సమయంలో థియేటర్ టాప్ లేచిపోయే రేంజులో హంగామా చేస్తున్నారు. మరి కంప్లీట్ రన్ లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

Read Also: Mahesh Babu: తుఫాన్… తుఫాన్ లా పరిగెడుతున్నాడు

Show comments