Site icon NTV Telugu

Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…

Eagle

Eagle

మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని… రవితేజని సూపర్ గా ప్రెజెంట్ చేసాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఈగల్ సినిమా రిలీజై ఉంటే ఖచ్చితంగా ఎదో ఒక సినిమాకి భయంకరమైన లాస్ జరిగేది. పండగ సీజన్ లో పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈగల్ సినిమా ఓవరాల్ గా మూడు రోజుల్లో 30 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇది రవితేజ సినిమాకి తక్కువే అయినా కూడా సీజన్ ని కన్సిడర్ చేసి చూస్తే ఫిబ్రవరి నెల ఇండస్ట్రీకి బ్యాడ్ సీజన్… ఈ సీజన్ లో ఈగల్ మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నట్లే లెక్క.

మొదటి రోజు మార్నింగ్ షో నుంచి మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో… ఈవెనింగ్ షోస్ నుంచి అన్ని సెంటర్స్ ఫుల్ అయ్యాయి. మూడు రోజుల్లో 60% బిజినెస్ రికవరీ చేసిన ఈగల్ సినిమా కొన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కి చేరువలో ఉంది. ఈరోజు మండే టెస్ట్ ని పాస్ అయితే చాలు… ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. అయితే వర్కింగ్ డే కాబట్టి ఈగల్ సినిమా ఈరోజు ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎంతగా రప్పిస్తుంది అనేది చూడాలి. ఈరోజు వీక్ అయితే మాత్రం ఈగల్ సినిమాకి లాంగ్ రన్ కష్టమవుతుంది.

Exit mobile version